డబుల్ బెడ్రూమ్ కాలనీలో విద్యుత్ కష్టాలు — ఒకే మీటర్‌తో 30 కుటుంబాల ఆవేదన
Gandipet పరిధిలోని Kismatpur డివిజన్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు విద్యుత్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. Rajendranagarలోని ఈ కాలనీలో మూడు సంవత్సరాలుగా నివసిస్తున్న 30కి పైగా కుటుంబాలకు విడివిడిగా మీటర్లు ఇవ్వకపోవడంతో అందరికీ కలిపి ఒకే మీటర్ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది.
దీంతో నెలకు ₹30 వేల నుంచి ₹32 వేల వరకు భారీ బిల్లులు వస్తున్నాయని, ఒక్క ఫ్యాన్-లైట్ వాడినా వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“పేరుకే సొంత ఇల్లు… కానీ బిల్లులు చూస్తే అద్దె ఇంట్లో ఉండటమే మేలు అనిపిస్తోంది” అని కాలనీ వాసులు వాపోతున్నారు.
⚡ అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు
అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు వచ్చి ఫోటోలు తీసుకెళ్లడం తప్ప సమస్యను పరిష్కరించలేదని స్థానికులు చెబుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రతి ఇంటికి విడి కనెక్షన్ ఇవ్వడం సాధ్యంకాలేదని ఆరోపిస్తున్నారు.
📢 వెంటనే చర్యలు తీసుకోవాలి
ప్రతి ఇంటికి ప్రత్యేక విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని, భారీ బిల్లుల నుంచి ఉపశమనం కల్పించాలని కాలనీ వాసులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
