మార్చి 2న హైదరాబాద్కు రానున్న రాహుల్ గాంధీ — అనంతగిరిలో కాంగ్రెస్ శిక్షణ శిబిరంలో పాల్గొననున్న అగ్రనేత
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు వేగం పెరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మార్చి 2న హైదరాబాద్కు రానున్నారు. అనంతరం ఆయన Ananthagiri Hills లో నిర్వహించే శిక్షణా తరగతులకు హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత నిర్మాణంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల వ్యూహాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ శిక్షణా శిబిరం ద్వారా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం, సమన్వయాన్ని పెంపొందించడం, భవిష్యత్ ఎన్నికలకు బలమైన వ్యూహాన్ని సిద్ధం చేయడం కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
