మినాబ్ స్కూల్‌పై బాంబు దాడి — ఐదుగురు విద్యార్థినుల మృతి; గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార మిస్సైల్ దాడులు
Iran–Israel మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చింది. సదరన్ ఇరాన్‌లోని Minab నగరంలోని ఒక ఎలిమెంటరీ స్కూల్‌పై బాంబు దాడి జరిగినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో ఐదుగురు విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా, కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.
Hormozgan Provinceలో జరిగిన ఈ ఘటనతో మినాబ్ నగరం వణికిపోయింది. స్కూల్ భవనం భాగంగా ధ్వంసమైందని, ఘటనాస్థలిలో భయాందోళన వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. Saudi Arabia, United Arab Emirates, Bahrain, Qatar, Jordan, Kuwait దేశాల్లోని యూఎస్ సైనిక స్థావరాలపై మిస్సైల్ దాడులు జరిగినట్లు సమాచారం.
బెహ్రెయిన్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌పై దాడులు జరిగినట్లు వార్తలు వైరల్ అవుతుండగా, ఖతార్ రాజధాని Dohaలో కూడా పేలుళ్లు సంభవించినట్లు అక్కడి రక్షణ శాఖ ధృవీకరించినట్లు కథనాలు వెల్లడించాయి.
ఈ దాడుల నేపథ్యంలో పలు గల్ఫ్ దేశాలు తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేశాయి. దేశ సార్వభౌమాధికారంపై దాడులు కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సౌదీ అరేబియా హెచ్చరించినట్లు సమాచారం.
ప్రస్తుతం పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉండగా, అంతర్జాతీయ సమాజం శాంతి చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిస్తోంది. మరిన్ని అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.
