రోడ్డుపై కుక్క అడ్డు.. కారు బోల్తా – స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్
Karimnagar జిల్లాలోని Jammikunta మండలం వెంకటేశ్వర్లపల్లె గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై అకస్మాత్తుగా కుక్క అడ్డు రావడంతో కారు అదుపు తప్పి పంటచేనులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఇలాంటి ఘటనే రెండు నెలల క్రితం Sangareddy districtలో జరిగింది. రోడ్డుపై అడ్డొచ్చిన కుక్కను తప్పించబోయి బైక్‌పై నుంచి పడిపోవడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన Kandi మండలం Indrakaran పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, మండలంలోని Julkal గ్రామానికి చెందిన పట్నం ప్రవీణ్ (28) తన బంధువు పట్నం మల్లేశ్‌తో కలిసి బైక్‌పై జుల్కల్ నుంచి Shankarpally వైపు వెళ్తున్నాడు. మధ్యలో అకస్మాత్తుగా రోడ్డుపై కుక్క అడ్డు రావడంతో దానిని తప్పించబోయి బైక్ చెట్టును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ప్రవీణ్ తలకు, ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న మల్లేశ్ తలకు గాయాలు కావడంతో అతడిని శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
