99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై మెదక్‌లో సమీక్షా సమావేశం
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రకటించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన శుక్రవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం ప్రారంభమైంది.
ఈ సమావేశానికి మెదక్ లోక్‌సభ సభ్యుడు రఘునందన్ రావు, జహీరాబాద్ లోక్‌సభ సభ్యుడు సురేష్ షెట్కార్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు. అలాగే సంగారెడ్డి, మెదక్ మరియు సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు కూడా పాల్గొన్నారు.
సమావేశంలో మెదక్ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పథకాల పురోగతి, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
వివిధ శాఖల అధికారులు మరియు మెదక్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. జిల్లాలో ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
