తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామి
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి – భద్రతా నిబంధనలు తప్పనిసరి
హైదరాబాద్, మార్చి 7: ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను రాబోయే సంవత్సరాల్లో 3 ట్రిలియన్ ఆధునిక ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి జీ. వివేక్ వెంకటస్వామి తెలిపారు.
ఈ లక్ష్య సాధన కోసం ప్రభుత్వం పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారులు మరియు ఇతర సంస్థలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐఐ) నిర్వహించిన వార్షిక సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేయడానికి ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ఉపాధి శాఖ ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs) ఏర్పాటు చేసింది. భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై సీఐఐతో చర్చలు జరిపినట్లు మంత్రి.
తెలంగాణలో పెట్టుబడులు స్థిరంగా పెరుగుతున్నాయని, త్వరలోనే అనేక కొత్త పరిశ్రమలు రాష్ట్రంలో స్థాపించబడనున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల అవసరాలను తీర్చగల నైపుణ్యంతో కూడిన మానవ వనరులను సిద్ధం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. పరిశ్రమల మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త శిక్షణ కోర్సులను కూడా ప్రవేశపెడుతున్నామని తెలిపారు.
పెట్టుబడులను ఆకర్షించడంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా సమానంగా ముఖ్యమని మంత్రి వివరించారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నప్పటికీ, పరిశ్రమలు కూడా నిబంధనలు మరియు ప్రమాణాలను స్వచ్ఛందంగా పాటించాల్సిన బాధ్యత.
పరిశ్రమలు భద్రతా మార్గదర్శకాలు మరియు చట్టబద్ధ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని మంత్రి నిర్దేశించారు. భారత ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పరిశ్రమలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త కార్మిక చట్టాలను పరిశ్రమలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. భద్రతా ప్రమాణాలు పాటించడానికి అయ్యే ఖర్చు తక్కువే అయినా, నిర్లక్ష్యం వల్ల నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి చేసిన సేవలను మంత్రి స్మరించారు. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పెన్షన్ పథకం ప్రవేశపెట్టాలని ఆయన ప్రతిపాదించినప్పుడు పరిశ్రమల నుంచి కొంత వ్యతిరేకత ఎదురైనా, నేడు అది కార్మికులకు ఎంతో ప్రయోజనకరమైన సామాజిక భద్రతా పథకంగా నిలిచిందని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో స్థిరమైన పారిశ్రామికాభివృద్ధి మరియు కార్మికుల సంక్షేమం కోసం పరిశ్రమలు ప్రభుత్వంతో కలిసి పనిచేసి చట్టబద్ధమైన నిబంధనలను పూర్తిగా పాటించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి.
