గ్యాస్ సంక్షోభం ప్రభావం.. ఫుడ్ డెలివరీ కంపెనీలకూ తంటాలు: జేఎం ఫైనాన్షియల్ రిపోర్ట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం భారత్ గ్యాస్ ఎకోసిస్టమ్‌పై కనిపించడం. ఖతార్ నుంచి గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో పలు రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని JM ఫైనాన్షియల్ విడుదల చేసిన తాజా నివేదిక.
రిపోర్టు ప్రకారం ఒప్పందాల ప్రకారం సరఫరా చేయలేక కొన్ని కంపెనీలు ‘ఫోర్స్ మెజూర్’ నోటీసులు జారీ చేశాయి. అంటే అనివార్య పరిస్థితుల కారణంగా సరఫరా చేయలేమని ప్రకటించాయి. ప్రస్తుతం పారిశ్రామిక సరఫరాకు గ్యాస్ సరఫరా 10 నుంచి 50 శాతం వరకు తగ్గినట్లు తెలుస్తోంది.
ఆయిల్, గ్యాస్ రంగంపై ప్రభావం
గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఎల్‌ఎన్‌జీ డిమాండ్ తగ్గే అవకాశం ఉందని నివేదిక ఉంది. దీనివల్ల GAIL, Petronet LNG, గుజరాత్ గ్యాస్ వంటి కంపెనీల వ్యాపారంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖతార్ ఎల్‌ఎన్‌జీపై ఎక్కువగా ఆధారపడే పెట్రోనెట్‌కు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి చమురు విక్రయ సంస్థల మార్జిన్లపై కూడా ప్రభావం పడుతుందని తెలుస్తోంది.
క్విక్ సర్వీస్ రెస్టారెంట్లపై ప్రభావం
గ్యాస్ కొరత వల్ల రెస్టారెంట్ రంగం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దేవయాని ఇంటర్నేషనల్, సఫైర్ ఫుడ్స్, వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్, రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా వంటి సంస్థల కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నట్లు సమాచారం. సఫైర్ ఫుడ్స్ వంట అవసరాల్లో 63 శాతం ఎల్పీజీపైనే ఉందని, ప్రస్తుతం వారానికి సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయని తెలిసింది. పరిస్థితి కొనసాగితే కొన్ని వస్తువుల విక్రయాలను నిలిపివేసే అవకాశం ఉందని అంచనా.
హోటళ్లు, రెస్టారెంట్ల కార్యకలాపాలు తగ్గితే ఫుడ్ డెలివరీ రంగంపైనా ప్రభావం పడుతోంది. ముఖ్యంగా Swiggy వంటి కంపెనీల వ్యాపారంపై ప్రభావం ఉండొచ్చని నివేదిక అందించింది.
కెమికల్ రంగానికి సవాళ్లు
భారత్ ఉత్పత్తుల పరిశ్రమకు విదేశాల నుంచి దిగుమతి చేసే అమ్మోనియా కీలక ముడి పదార్థం. Paradeep Phosphates, Coromandel International వంటి సంస్థలు మధ్యప్రాచ్య దేశాల నుంచి అమ్మోనియాను దిగుమతి చేసుకుంటాయి. ప్రస్తుతం సముద్ర మార్గాల్లో ఏర్పడిన ఆటంకాల కారణంగా ఈ రంగం కూడా సవాళ్లను ఎదుర్కొంటోంది.
ఇప్పటికే నైట్రిక్ యాసిడ్, సోడియం నైట్రేట్, అమ్మోనియా, మెథనాల్, ఎసిటిక్ యాసిడ్ వంటి రసాయనాల ధరలు పెరిగాయని కంపెనీలు చెబుతున్నాయి. పరిస్థితి కొనసాగితే మరిన్ని రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.
