Accreditation Card | జర్నలిస్టులకు సర్కార్ ధోకా.. అక్రెడిటేషన్ కార్డుల్లో భారీగా కోత
Accreditation Card | రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులను కాంగ్రెస్ సర్కారు దారుణంగా వంచించింది. జర్నలిస్టులు స్టేటస్ సింబల్‌గా భావించే అక్రెడిటేషన్ కార్డుల్లో భారీగా కోతపెట్టింది.
Accreditation Card | హైదరాబాద్ : రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులను కాంగ్రెస్ సర్కారు దారుణంగా వంచించింది. జర్నలిస్టులు స్టేటస్ సింబల్‌గా భావించే అక్రెడిటేషన్ కార్డుల్లో భారీగా కోతపెట్టింది. జర్నలిస్టుల కండ్లు బైర్లు కమ్మేలా కొత్త అక్రెడిటేషన్ల జారీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు సోమవారం జీవో 252ను జారీచేశారు. ఇక నుంచి రెండు రకాలైన కార్డులిస్తామని, అక్రెడిటేషన్‌కార్డు, మీడియా కార్డు రూపంలో ఇవి ఉంటాయని తెలిపారు. అక్రెడిటేషన్ కార్డు ప్రభుత్వ సమాచారాన్ని సేకరించేందుకు రిపోర్టర్లకు గుర్తింపుగా ఉపయోగపడుతుందని, డెస్క్ జర్నలిస్టులు మీడియా కార్డును కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమే వాడుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలిసారిగా డిజిటల్ న్యూస్ మీడియాకు అక్రెడిటేషన్ కార్డులివ్వనున్నారు. అది కూడా వెబ్‌సైట్లకు మాత్రమేనని స్పష్టంచేశారు. ఈ కొత్త నిబంధనలతో అక్రెడిటేషన్ కార్డులకు భారీగా కోతపడుతుందని జర్నలిస్టు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం గతంలో 23 వేల కార్డులివ్వగా, కొత్త జీవోతో 10 వేలకు పైగా కార్డులకు కోత పడే ప్రమాదం ఉన్నదని జర్నలిస్టు సంఘాల నేతలు చెప్తున్నారు.
