న్యూఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్: వేలాది ఉద్యోగాలకు దారితీసే టెక్ వేదిక
ఏఐతో ఉద్యోగాలు తగ్గిపోతాయనే ఆందోళనల మధ్య ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ యువ ఇంజనీర్లకు కొత్త ఉపాధి అవకాశాలను చూపిస్తోంది. ప్రముఖ కార్పొరేట్ సంస్థలు భారీగా నియామకాలు చేపడుతున్నాయి.
నియామకాల దిశగా దిగ్గజ కంపెనీలు
Reliance Industries Limited, Adani Group సంస్థలు పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతుండగా, Dell Technologies, Salesforce, Ernst & Young (ఈవై), Deloitte వంటి సంస్థలు కూడా ట్యాలెంట్ కోసం వెతుకుతున్నాయి.
Infosys, Anthropicతో కలిసి ఏఐ నియామకాలపై దృష్టి సారించింది. Google తన ఏఐ హబ్ కోసం సిబ్బందిని నియమిస్తోంది.
ఏఐ రంగంలో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రావడంతో రాబోయే రోజుల్లో వేలాది కొత్త ఉద్యోగాలు సృష్టించబడే అవకాశం ఉంది. ఏఐ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, క్లౌడ్ డెవలపర్లు, సైబర్ ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. సాధారణ కోడింగ్ కన్నా ఏఐ మేనేజ్‌మెంట్ తెలిసిన వారికి ప్రాధాన్యం పెరుగుతోంది.
“ఉన్న ఉద్యోగాలు పోతాయి… కొత్తవి వస్తాయి” – Nandan Nilekani
ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నప్పటికీ, 17 కోట్ల కొత్త అవకాశాలు వస్తాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని పేర్కొన్నారు. మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు.
Eternal–OpenAI భాగస్వామ్యం
Zomato, Blinkit పేరెంట్ కంపెనీ ఎటర్నల్, తన ఏఐ సామర్థ్యాల పెంపు కోసం ఓపెన్ ఏఐతో చేతులు కలిపింది. బిజినెస్ మరియు డెలివరీ పార్ట్‌నర్ల కోసం ఏఐ ఆధారిత విధానాలను ప్రవేశపెట్టనుంది. ‘స్టిచ్’ ప్లాట్‌ఫామ్‌లో అత్యాధునిక మోడళ్లను వినియోగించనున్నారు.
అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి
Adani Group 2035 నాటికి ఏఐ డేటా సెంటర్ల అభివృద్ధికి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. సోలార్ ఎనర్జీతో నడిచే డేటా సెంటర్ల ద్వారా దేశంలో 250 బిలియన్ డాలర్ల ఏఐ మౌలిక సదుపాయాలను సృష్టించాలనే లక్ష్యంగా గౌతమ్ అదానీ తెలిపారు. వైజాగ్‌లో గూగుల్, హైదరాబాద్–పుణేలో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో కేంద్రాలు ఏర్పడనున్నాయి.
“2050 నాటికి ఉద్యోగాలే ఉండవు” – Vinod Khosla
ఏఐ అభివృద్ధి వేగం దృష్ట్యా 2050 నాటికి సంప్రదాయ ఉద్యోగాల అవసరం తగ్గిపోవచ్చని ప్రముఖ పెట్టుబడిదారు వినోద్ ఖోస్లా అంచనా వేశారు. ముఖ్యంగా ఐటీ సేవలు, బీపీఓ రంగాలు తీవ్ర ప్రభావం ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.
“డాక్టర్లకు ఏఐ సాటి కాదు” – Anupriya Patel
కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ మాట్లాడుతూ డాక్టర్లను ఏఐ భర్తీ చేయదని స్పష్టం చేశారు. ఏఐ కేవలం సహాయకారిగా మాత్రమే ఉంటుందని, వైద్యరంగంలో మానవీయ స్పర్శ, సానుభూతి కీలకమని తెలిపారు. సాధారణ పనులను ఏఐ నిర్వహిస్తే, వైద్యులు క్లిష్ట కేసులపై దృష్టి పెట్టవచ్చని అన్నారు.
