అవయవదానంతో చిరంజీవిగా నిలిచిన అలిన్ షెరిన్ – ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
పథనంథిట్ట (కేరళ):
కేరళలో రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్‌గా మారిన పది నెలల చిన్నారి అలిన్ షెరిన్‌కు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. Keralaలోని Pathanamthitta జిల్లా మల్లప్పల్లిలో ఈ కార్యక్రమం జరిగింది.
“ఈ చిన్నారి భౌతికకాయాన్ని మనం ఖననం చేస్తున్నా… అవయవదానం అనే మహోన్నత చర్యతో ఆమె ఇతరుల రూపంలో చిరంజీవిగానే ఉంటుంది” అని కేంద్ర మంత్రి Suresh Gopi పేర్కొన్నారు. ప్రధానమంత్రి Narendra Modi సూచన మేరకు దేశం తరఫున తాను హాజరై అలిన్‌కు నివాళులు అర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రోడ్డు ప్రమాదం అనంతరం బ్రెయిన్‌డెడ్‌గా మారిన అలిన్ గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కళ్లు ఇతర చిన్నారులకు అమర్చేందుకు ఆమె తల్లిదండ్రులు మహత్తర నిర్ణయం తీసుకున్నారు. ఈ అవయవదానంతో పలువురు చిన్నారులకు కొత్త జీవం లభించనుంది.
కేరళ రాష్ట్రమంతా ఈ చిన్నారి త్యాగానికి నివాళులు అర్పించింది. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు అంత్యక్రియలకు హాజరై సంతాపం తెలిపారు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయినా, అవయవదానంతో అలిన్ షెరిన్ ఎన్నో కుటుంబాల్లో ఆశాజ్యోతి వెలిగించిందని పలువురు భావోద్వేగంగా పేర్కొన్నారు.
