కొత్త సిమ్ తీసుకునేటప్పుడు జాగ్రత్త! ఫింగర్‌ప్రింట్‌తో మోసం – అమాయకుడి పేరుతో సైబర్ నేరాలు
కొత్త సిమ్‌కార్డు తీసుకోవడం లేదా నెట్వర్క్ మార్చేందుకు పోర్ట్ అవుతున్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వెలుగుచూసిన ఘటన దీనికి నిదర్శనం. సైబర్ నేర దర్యాప్తులో లభించిన ఓ మొబైల్ నంబర్ మురాద్ ఖాన్ అనే వెల్డర్ పేరుతో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అయితే ఆ నంబర్ తనది కాదని మురాద్ చెప్పడంతో అసలు విషయం బయటపడింది.
నెట్వర్క్ సమస్యల కారణంగా 2024 ఫిబ్రవరి 18న తన సిమ్‌ను పోర్ట్ చేసిన సమయంలో, డీలర్ రెండుసార్లు ఫొటో, ఫింగర్‌ప్రింట్ తీసుకున్నాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ బయోమెట్రిక్ వివరాలతో మరో సిమ్‌ను వేరొకరికి జారీ చేసి, దాని ద్వారా లక్షల రూపాయల సైబర్ మోసాలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో సిమ్‌కార్డు డీలర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అమాయకుల పేరుతో సిమ్‌కార్డులు తీసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న పెద్ద ముఠా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సిమ్ తీసుకునే సమయంలో అనవసరంగా మళ్లీ బయోమెట్రిక్ అడిగితే అనుమానించి, వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
