హైదరాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్లు – నాలుగు ప్రత్యేక రైలు యాత్రలు ప్రకటించిన ఐఆర్సీటీసీ
హైదరాబాద్: మ్యాన్‌హోల్స్‌లో చెత్త వేయొద్దని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (జలమండలి)కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. మ్యాన్‌హోల్ చెత్తబుట్ట కాదని, ఇష్టం వచ్చినట్లు ఘన వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
మాదాపూర్ సర్కిల్లోని చందర్ నాయక్ థాండా ప్రాంతంలో సీవరేజ్ ఓవర్‌ఫ్లో సమస్య తలెత్తిన నేపథ్యంలో జలమండలి ఈ హెచ్చరికలు చేసింది. ప్రధాన సీవరేజ్ పైపులో తీవ్ర చోకేజి ఏర్పడటంతో రోడ్లపైకి మురుగు ప్రవహించిందని, సోషల్ మీడియా ద్వారా అనేక ఫిర్యాదులు అందాయని అధికారులు తెలియజేశారు.
సమస్య పరిష్కారానికి గత మూడు రోజులుగా హైప్రెషర్ జెట్టింగ్ మెషిన్‌తో డీ-సిల్టింగ్ పనులు చేపట్టామని, టెలిస్కోపిక్ హైడ్రాలిక్ గ్రాబర్ సహాయంతో పైపులు పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో మ్యాన్‌హోల్స్ నుంచి బ్లాంకెట్లు, బెడ్ షీట్లు, బట్టలు, ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లు వంటి అనేక ఘన వ్యర్థాలు బయటకు తీసినట్లు తెలుస్తోంది. కొరకు. కొన్ని చోట్ల దిండ్లు, పరుపులు కూడా బయటకు వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.
ఇలాంటి ఘన వ్యర్థాలు సీవరేజ్ ప్రవాహానికి తీవ్ర ఆటంకం కలిగించి పైపుల్లో ఒత్తిడి పెరగడానికి కారణమవుతుందని అధికారులు చెబుతున్నారు. వ్యర్థాలు పేరుకుపోవడంతో మ్యాన్‌హోల్స్ పొంగిపోతున్న పరిస్థితి ఏర్పడుతోందని, ప్రజల అవగాహన లోపమే సమస్యకు ప్రధాన కారణమని తెలిపారు.
అదేవిధంగా హోటళ్లు, బేకరీలు, ఫుడ్ కోర్టులు సీవరేజ్ నెట్‌వర్క్‌లకు నేరుగా కనెక్షన్లు ఇవ్వడం, సిల్ట్ ఛాంబర్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల కూడా పైపుల్లోకి ఘన వ్యర్థాలు చేరుతున్నాయని చెప్పారు. దీంతో సీవరేజ్ పైపులపై ఒత్తిడి పెరిగి ఓవర్‌ఫ్లో సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు.
అర్హులైన వినియోగదారులు తప్పనిసరిగా సిల్ట్ ఛాంబర్లు ఏర్పాటు చేయాలి, ఇకపై మ్యాన్‌హోల్స్‌లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి అధికారులు తెలియజేసారు. నగర శుభ్రత కోసం ప్రజల బాధ్యతగా సహకరించాలని, మ్యాన్‌హోల్స్‌లో చెత్త లేదా ఇతర ఘన వ్యర్థాలు వేయకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
