మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ అభ్యర్థి
కోల్‌బెల్ట్ :
రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ 13వ వార్డు బీజేపీ అభ్యర్థి దండు హంసవేణి సదానందం కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం రామకృష్ణాపూర్ రామాలయం ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలకు మంత్రి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అలాగే చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరినట్లు వారు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పార్వతి విజయ గెలుపు కోసం కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు.
