BREAKING: ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. ఈసారి కీలక మార్పులు
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వార్షిక పరీక్షల హాల్ టికెట్లు బోర్డు విడుదల చేసింది. హాల్ టికెట్లు ఈసారి క్యూఆర్ కోడ్‌కు అనుసంధానం చేస్తూ కీలక మార్పులు చేసింది ఇంటర్మీడియేట్ బోర్డు.
మార్చి 2026లో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల హాల్ టికెట్లను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) గురువారం విడుదల చేసింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
