నల్లగొండ జిల్లాలో బస్సు ప్రమాదం
కొర్లపాడు సమీపంలో తిరువూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు–లారీ ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాయపడిన వారిని చికిత్స కోసం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
