టీటీడీ లడ్డూ నెయ్యి కల్తీపై సిట్ నివేదిక కోరిన కేబినెట్
అమరావతి:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మొత్తం 35 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ అంశంపై సిట్ (SIT) సమర్పించిన నివేదికపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. సిట్ నివేదికపై వైకాపా చేస్తున్న దుష్ప్రచారంపై కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో సిట్ నివేదికను అధికారికంగా తెప్పించాలని కేబినెట్ కోరింది. ఇప్పటికే సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయంను అధికారులు మంత్రివర్గానికి వివరించారు. సిట్ నివేదిక అధికారికంగా వచ్చిన అనంతరం దానిపై స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు.
