Children: బాలల్లోనూ భయానక వ్యాధులు.. చరవాణులు తెచ్చిపెట్టిన సమస్య
బెంగళూరు (జేపీనగర), న్యూస్‌టుడే: మారిపోతున్న జీవనశైలి, పాశ్చాత్య ఆహార పద్ధతి, ఎక్కువ సమయం టీవీలు, చరవాణుల ముందు కాలం గడుపుతన్న బాలల్లో అనారోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. జాతీయ బాల స్వాస్థ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వైద్య, ఆరోగ్య పరీక్షల్లో 33.59 లక్షల మంది బాలలు వేర్వేరు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 93.41 లక్షల మంది బాలలు పేర్లు నమోదు చేసుకోగా, ఏప్రిల్ నుంచి నవంబరు మధ్యలో 80.27 లక్షల బాలలకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. చర్మ, దంత, దృష్టి, శ్రవణ దోషాలు, శ్వాసకోశ, హృద్రోగ సమస్యలు, ఎదుగుదల తగ్గడం, నేర్చుకోవడం పట్ల ఆసక్తి లేకపోవడం, అపౌష్టికత, రక్తహీనత తదితర సమస్యలను వైద్యులు గుర్తించి, చికిత్సలకు సిఫార్సు చేశారు.
