క్రికెట్ ఆడొద్దని తల్లి మందలించడంతో తొమ్మిదవ తరగతి విద్యార్ధి ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న న్యాలం ఆకర్ష్(14) అనే విద్యార్ధి ఆత్మహత్య.
క్రికెట్ ఆడుకునేందుకు వెళ్ళొద్దని, హోంవర్క్ చేసుకోవాలని బాలుడిని మందలించిన తల్లి శ్రీదేవి.
దీంతో క్షణికావేశానికి లోనై బెడ్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుని, ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఆకర్ష్.
తలుపులు పగలగొట్టి బాలుడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించిన వైద్యులు.
