మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బలం.. 44వ వార్డు బీఆర్ఎస్ నేత కాంగ్రెస్‌లో చేరిక
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రెడ్ హౌస్)లో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్ గారు, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య గార్ల సమక్షంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 44వ వార్డు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనంతుల శ్రీనివాస్ గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుణగంటి హేమ సతీష్ గారి విజయం కోసం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఘన విజయం సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
