Delhi-Agra Expressway Bus Fire Incident: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై బస్సులకు మంటలు.. కొందరు చనిపోయి ఉంటారని అనుమానాలు!
Delhi-Agra Expressway Bus Fire Incident: అసలే పొగమంచు. ఆ మంచులో ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు. బస్సుల్లో మంటలు కూడా ఇలాంటి ఘటనే. అసలేం జరిగిందో తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్‌లోని మథురా సమీపంలో ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే (యమున ఎక్స్‌ప్రెస్‌వే)పై డిసెంబర్ 16, 2025 తెల్లవారుజామున అనేక బస్సులకు మంటలు అంటుకున్న దారుణ ఘటన జరిగింది. మంటలతోపాటూ.. దట్టమైన పొగలు కూడా వచ్చాయి. ఈ ఘటనలో మరణాలు కూడా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. “మథురా, యూపీలో ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే పై అనేక బస్సులకు మంటలు చెలరేగాయి. మరణాల భయం ఉంది. మరిన్ని వివరాలు కోసం ఎదురుచూడాలి” అని ANI వార్తా సంస్థ తెలిపింది.
ఈ ఘటన కచ్చితంగా ఎక్కడ జరిగింది, ఎన్ని బస్సులు ప్రమాదానికి గురయ్యాయి అనే వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. కానీ మంటలు చాలా భారీగా ఉన్నాయి. ప్రయాణికులు ఉన్న నాలుగు బస్సులు మంటల్లో చిక్కుకున్నాయి. శీతాకాలంలో ఉత్తర భారతంలో దట్టమైన పొగమంచు (ఫాగ్) సాధారణం కావడంతో, ఈ ప్రమాదానికి పొగమంచు కారణమై ఉండవచ్చని ప్రాథమిక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా డిసెంబర్ నెలలో యమున ఎక్స్‌ప్రెస్‌వే పై పొగమంచు వల్ల పలు ప్రమాదాలు జరిగాయి. వాహనాలు ఢీకొనడం, మంటలు చెలరేగడం వంటివి జరిగాయి..
