టీటీడీకి రూ.10.51 లక్షలు విరాళం
తిరుమల, 2026 ఫిబ్రవరి 02: హైదరాబాద్ కు చెందిన సాయి సిద్ధార్థ్ ఎంటర్పైజర్స్ సంస్థ సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10.51 లక్షలు విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీ ని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
