Fake news Alert: ATMల నుంచి ఇక ₹500 నోట్లు రావా? నిజమెంత?
ఇంటర్నెట్ డెస్క్: 2026 మార్చి నాటికి ఏటీఎంల నుంచి రూ.500 నోట్లను ఆర్‌బీఐ నిలిపివేస్తుందంటూ జరుగుతోన్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. మార్చి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ₹500 నోట్ల చలామణిని నిలిపివేస్తుందంటూ కొన్ని సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయని తెలిపింది. ఇది పూర్తిగా అసత్య ప్రచారమని స్పష్టం చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ఓ పోస్టు పెట్టింది. (Fact Check)
‘‘ఆర్‌బీఐ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. రూ.500 నోట్లు నిలుపుదల కావు, అవి చట్టబద్ధంగానే చెల్లుబాటు అవుతాయి’’ అని స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి అసత్య వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ఏదైనా వార్తను నమ్మడం లేదా వాటిని వేరొకరికి షేర్ చేసే ముందు అధికారిక వర్గాల నుంచి ధ్రువీకరించుకోవాలని సూచించింది.
