అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక మూడు రోజులు మృతదేహంతో నివసించిన కుటుంబ సభ్యులు
ఇంటి యజమాని ఫిర్యాదుతో, స్వచ్ఛంద సంస్థ సహాయంతో అంత్యక్రియలు జరిపించిన పోలీసులు.
హైదరాబాద్ – జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్‌నగర్ సమీపంలో ఉన్న ఎన్ఎల్‌బీనగర్ ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వామిదాస్(76) అనే వ్యక్తి.
ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించే క్రమంలో, తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని ఉద్యోగం మానేసిన స్వామిదాస్ చిన్న కూతురు సలోని.
ఆరోగ్య పరిస్థితి విషమించి స్వామిదాస్ మరణించగా, అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక మూడు రోజుల నుండి మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకుని నివసించిన కుటుంబ సభ్యులు.
మూడు రోజులుగా బయటకు రాకపోవడంతో, అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చిన ఇంటి యజమాని.
ఘటనా స్థలానికి చేరుకుని, విషయం తెలుసుకుని, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, స్వచ్ఛంద సంస్థ సహాయంతో అంత్యక్రియలు జరిపించిన పోలీసులు.
