హైదరాబాద్ సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లా రాయికల్ టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
గుర్తు తెలియని వాహనం ఇన్నోవా క్రిస్టా కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
మృతులను రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌కు చెందిన పుల్లగుర్రం పురుషోత్తం రెడ్డి, గంగిరెడ్డి మధుసూదన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అరుణాచలం నుంచి యాత్ర ముగించుకుని హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ముఖ్యాంశాలు:
- అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
- అక్కడికక్కడే ఇద్దరు మృతి
- ముగ్గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
- రంగారెడ్డి జిల్లా రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఘటన
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
