గల్ఫ్‌లో మళ్లీ మంటలు.. బహ్రెయిన్‌పై ఇరాన్ భీకర దాడులు
అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. ఎప్పుడు ఎక్కడ బాంబులు పేలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. మిస్సైళ్ల దాడులతో భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోతుండగా, ప్రజలు ప్రాణాలు నిలుపుకోవడానికి పరుగులు తీస్తున్నారు.
ఇరాన్‌ను అణచివేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గకుండా ఎదురుదాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బహ్రెయిన్‌పై ఇరాన్ భారీ దాడులకు దిగింది. మిస్సైళ్లు, డ్రోన్లతో సమన్వయంగా దాడులు జరిపింది.
ఇరాన్ దాడుల తీవ్రతకు బహ్రెయిన్ రక్షణ వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. మొదట ప్రతిఘటన చూపినట్లు కనిపించినా, తర్వాత ఇరాన్ దాడుల ధాటిని తట్టుకోలేక రక్షణ వ్యవస్థలు చేతులెత్తేసినట్టు సమాచారం. బహ్రెయిన్‌లోని ప్రధాన ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ సుమారు 75 మిస్సైళ్లు, 123 డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడితో పెట్రోల్ రిఫైనరీ భారీ మంటల్లో చిక్కుకుని పెద్ద ఎత్తున నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా అమెరికా కూడా తన దాడులను కొనసాగిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున అమెరికా B-2 బాంబర్ విమానాలతో ఇరాన్‌పై దాడులు చేపట్టింది. ముఖ్యంగా ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్ లాంచర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు సమాచారం.
అదే సమయంలో ఇరాన్‌కు చెందిన డ్రోన్ క్యారియర్ నౌకపై కూడా అమెరికా దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్‌కు చెందిన భారీ నౌక మంటల్లో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
