ఫ్లై ఓవర్లు, ‘అండర్పాస్’ పనులు పూర్తి చేయిస్తా
చామకూర మల్లారెడ్డి
మాజీ మంత్రివర్యులు
మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు
ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో మైసమ్మ గుట్ట వద్ద వరంగల్ హై వే రోడ్డు నిర్మాణ పనులను ఎంపీ ఈటెల రాజేందర్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది.
హైదరాబాద్ వరంగల్ హైవే ఏర్పడిన తర్వాత ఘట్కేసర్, NTPC ప్రాంతాలలో రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చాలామంది చనిపోయారు.
మైసమ్మ గుట్ట కాలనీకి, హాస్టల్స్ కు, విద్యార్థులకు రోడ్డు క్రాస్ చేయడం ఇబ్బంది అవుతుందని ప్రజల కోరిక మేరకు ఈ ప్రాంతంలో అండర్పాస్ నిర్మించడానికి అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశం ఇవ్వడం జరిగింది.
సంవత్సర కాలంలో పాత అండర్పాస్లతో పాటుగా మైసమ్మ గుట్ట దగ్గర శాంక్షన్ అయినా అండర్ పాస్ కూడా పూర్తిచేసి ప్రజలకు సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తాం.
