కొండగట్టులో వాయుపుత్ర సదన్ ధర్మశాల నిర్మాణానికి శంకుస్థాపన
జగిత్యాల జిల్లా కొండగట్టులో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘన స్వాగతం పలికారు.
అనంతరం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో సుమారు రూ.35.19 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వాయుపుత్ర సదన్ 100 గదుల ధర్మశాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ధర్మశాల నిర్మాణం ద్వారా భక్తులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయని పలువురు తెలిపారు., ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, టీటీడీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
