క్యాతనపల్లి ఘటనపై గడ్డం వివేక్ వెంకటస్వామి ఆగ్రహం
క్యాతనపల్లి ఘటనపై మీడియాతో మాట్లాడిన కార్మిక మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి ముఖ్య వ్యాఖ్యలు:
- సుమన్ మా పై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు.
- మంత్రి, ఎంపీ కార్లపై రాళ్లు కొట్టడం కరెక్టా?
- ఇది ఏం పద్ధతి? దీన్ని టి హరీష్ రావు సమర్థిస్తారా?
- క్యాతనపల్లెలో ఎలాంటి సమస్య లేదు.
- సుమన్ దౌర్జన్యాన్ని అందరూ చూశారు.
- సుమన్ చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలే.
- రెచ్చగొట్టి డ్రామాలు చేస్తున్నారు.
మంత్రి వివరించిన ప్రకారం, మొదటి రోజు కోరమ్ లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారని, రెండో రోజు బయటి వ్యక్తులు వచ్చి అనవసరంగా గొడవ సృష్టించడంతో మళ్లీ వాయిదా పడిందన్నారు. ఎన్నికల ప్రక్రియను తాము ఎక్కడా అడ్డుకోలేదని స్పష్టం చేశారు.
రెండు రోజులుగా సుమన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గతంలో చెన్నూరు, క్యాతనపల్లెలో సరిగా ఎన్నికలు జరగలేదని, గుండా ఇజంతో ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. అధికార దుర్వినియోగం ఎవరు చేశారో ప్రజలు తెలుసునన్నారు.
“వాళ్లు క్యాంపులు పెట్టుకున్నప్పుడు మేమెప్పుడైనా గొడవ చేశామా? మేమేం అధికార దుర్వినియోగం చేశాం?” అని ప్రశ్నించారు.
ఇంకా అధికారంలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని, ఓటమి బాధతోనే సుమన్ ఫ్రస్టేషన్ చూపుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే సుమన్ చేసిన దాడిని ఖండించాలని హరీష్ రావును మంత్రి కోరారు.
“మేము చెన్నూరులో ఏరోజు బీఆర్ఎస్‌పై దాడి చేయలేదు, ఎవరినీ అరెస్ట్ చేయలేదు” అని మంత్రి స్పష్టం చేశారు.
