Bharat Taxi App: కేంద్రం నుంచి గుడ్‌న్యూస్.. జనవరి 1 నుంచి భారత్ ట్యాక్సీ సేవలు!
Bharat Taxi App Launch Date: కేంద్ర ప్రభుత్వం త్వరలోనే దేశీయ రవాణా రంగంలో అద్భుతమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రముఖ ప్రైవేట్ క్యాబ్ సంస్థలు ఉబర్‌తో పాటు ఓలాకు దీటుగా భారత్ ట్యాక్సీ (Bharat Taxi) యాప్‌ను తీసుకు రాబోతున్నట్లు తెస్తోంది. భారత ప్రజలకు కొత్త సంవత్సరం గిఫ్ట్‌గా దీని సేవలను జనవరి 1వ తేది నుంచి అందుబాటులో తీసుకు రాబోతున్నట్లు కేంద్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా రోజు క్యాబ్‌లు వినియోగించే ప్రజలకు చాలా మేలు జరుగుతుంది.
ప్రస్తుతం భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో క్యాబ్ సేవలు ప్రైవేటు కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. దీని కారణంగా కొన్ని కంపెనీలు డిమాండ్‌ను బట్టి చార్జీలను ఇష్టానుసారంగా పెంచుతూ వస్తున్నాయి. అలాగే రైడ్ క్యాన్సిలేషన్ ఫీజులతో పాటు డ్రైవర్ల ప్రవర్తన వంటి అంశాలపై ఇప్పటికి ప్రయాణికుల నుంచి ఎన్నో ఫిర్యాదు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రతి సామాన్యుడు అతి తక్కువ ధరలోనే నగరాల్లో అన్ని ప్రదేశాలకు సురక్షితంగా ప్రయాణాన్ని అంచడమే లక్ష్యంగా చేసుకుని క్రేంద్రం ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే కంపెనీ ప్రత్యేకమైన పనులను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా డ్రైవర్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికీ భారత్‌లోని ప్రధాన నగరాల్లో భారత్ ట్యాక్సీ యాప్‌లో దాదాపు 56 వేల మంది డ్రైవర్లు పేర్లను నమోదు చేసినట్లు కేంద్రం అధికారికంగా వెల్లడించింది. అయితే, ప్రైవేటు కంపెనీతో పోలిస్తే.. ఈ యాప్‌లో డ్రైవర్ల నుంచి వసూలు చేసే కమిషన్ చాలా తక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణమని సమచారం.. అయితే, ఈ కమిషన్ తగ్గడం వల్ల డైవర్ల ఆదాయం భారీగా పెరుగుతుంది.
ఈ భారత్ ట్యాక్సీ (Bharat Taxi) యాప్ వల్ల ప్రయాణికులకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రైవేట్ క్యాబ్‌లతో పోలిస్తే 16 నుంచి 25 శాతం వరకు తక్కువ ధరలకే ప్రయాణం చేయడానికి సాధ్యమవుతుందని సమాచారం.. అలాగే సర్జ్ ప్రైసింగ్ నుంచి కూడా చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు ఇది ప్రభుత్వ పర్యవేక్షణ ఉండటంతో భద్రతా ప్రమాణాలను కూడా కఠినంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. మొదటి విడతలో భాగంగా హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఈ సేవలను ప్రారంభించబోతున్నట్లు కేంద్రం యోచిస్తోంది. ఆ తర్వాత దశలవారీగా దేశమంతటా విస్తరించే ఛాన్స్‌లు ఉన్నాయి.
