నిజామాబాద్‌లో గన్ కాల్పుల కలకలం.. లారీ డ్రైవర్ హత్య
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవి తాండ సమీపంలోని జాతీయ రహదారి–44పై దుండగుల కాల్పుల్లో లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సల్మాన్ పెట్రోల్ బంక్ వద్ద లారీ నిలిపి ఉంచిన సమయంలో, మరో లారీలో వచ్చిన ముగ్గురు దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్‌తో కాల్చారు. తీవ్ర గాయాల పాలైన సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
కాల్పుల అనంతరం దుండగులు అదే లారీలో చంద్రయాన్‌పల్లి వరకు వెళ్లి ఓ దాబా వద్ద వాహనాన్ని వదిలేసి అడవిలోకి పరారయ్యారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
