Hyderabad: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌తో నెహ్రూ జూపార్క్ సందడి
న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌కు సందర్శకుల తాకిడి భారీగా పెరిగింది. ఒక్కరోజులోనే దాదాపు 25,900 మంది సందర్శకులు రావడంతో జూపార్క్ ఒక్కసారిగా కిటకిటలాడింది.
సందర్శకుల సౌకర్యార్థం జూ యాజమాన్యం వివిధ ప్రాంతాల్లో అధికారులు, సిబ్బందిని నియమించి నిరంతర నిఘా ఏర్పాటు చేసింది. రద్దీని ముందుగానే అంచనా వేసి చేపట్టిన ఏర్పాట్లపై సందర్శకులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అన్ని జంతు ఎన్‌క్లోజర్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి గార్డులను మోహరించారు. సందర్శకుల రద్దీ అధికంగా ఉండటంతో అన్ని జంతువులను వాటి వాటి ఎన్‌క్లోజర్లలో ప్రజల సందర్శన కోసం ఉంచారు.
