Hyderabad: హయత్‌నగర్ వద్ద రోడ్డు ప్రమాదం: ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి.. తండ్రికి తీవ్రగాయాలు
హైదరాబాద్: నగరంలోని హయత్‌నగర్ పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎంబీబీఎస్ విద్యార్థిని ఐశ్వర్య మృతిచెందారు. ఆర్టీసీ కాలనీ వద్ద తన తండ్రి పాండుతో కలిసి రోడ్డు దాటుతుండగా అతివేగంతో వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన ఐశ్వర్య, పాండును ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఐశ్వర్య మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం పాండును వేరే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐశ్వర్య మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
