హైదరాబాద్‌లో ఇల్లు, ఫ్లాట్, ప్లాట్ కొనేవారికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక సూచనలు
హైదరాబాద్‌లో ఇండ్లు, ఫ్లాట్లు, ఇంటి స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారు ముందుగా అన్ని వివరాలను పరిశీలించాలని హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన మరియు ఆస్తుల పరిరక్షణ ఏజెన్సీ కమిషనర్ ఎ.వి. రంగనాథ్ తెలిపారు. ముఖ్యంగా చెరువుల FTL (పూర్తి ట్యాంక్ లెవల్) పరిధిలో భూములు ఉన్నాయా లేదా అనేది తప్పనిసరిగా చెక్ చేయాలని చెప్పారు.
ప్లాట్లు కొనుగోలు చేసే ముందు లేఔట్‌కు అధికారిక అనుమతి ఉందా లేదా అనేది నిర్ధారించాలని ఆయన అన్నారు. ఇంటి నంబర్లు చూపిస్తూ లేదా బై నంబర్లతో ప్లాట్లు విక్రయిస్తే మరింత జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు.
గేటెడ్ కమ్యూనిటీ పేరుతో అమ్మే లేదా ప్లాట్లు లేదా విల్లాలకు సంబంధించి అవసరమైన అనుమతులు ఉన్నాయా అనేది కూడా పరిశీలించాలని చెప్పారు. అలాగే గేటెడ్ కమ్యూనిటీ అయితే చుట్టుపక్కల కాలనీలకు కనీసం 40 అడుగుల రహదారి చూపించారా లేదా అనేది కూడా చూడాలని సూచించారు.
ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రజలకు ఈ సూచనలు చేసినట్లు రంగనాథ్ తెలిపారు. హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. ఫిర్యాదులను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్, ఫిర్యాదుదారుల సమక్షంలోనే గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ ఇమేజీల భూముల వివరాలను పరిశీలించారు. అధికారులకు తగిన చర్యలు.
