ప్రయాగ్రాజ్లో ఐఏఎఫ్ ట్రైనీ విమానం కూలిన ఘటన – సిబ్బంది సురక్షితం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో బుధవారం (జనవరి 21) భారత వైమానిక దళానికి చెందిన ట్రైనీ మైక్రోలైట్ విమానం ప్రమాదానికి గురైంది. కేపీ ఇంటర్ కాలేజీ వెనుక ఉన్న చెరువులో విమానం కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
ఈ ప్రమాదానికి ఇంజిన్ వైఫల్యమే కారణమని ఎయిర్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు సిబ్బంది ఉండగా, వారు ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. ఘటనపై పూర్తి వివరాల కోసం దర్యాప్తుకు ఆదేశించినట్లు భారత వైమానిక దళం ప్రకటించింది.
