ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం: LPGపై కేంద్రం కీలక నిర్ణయం.. ఉత్పత్తి 10% పెంచాలని ఆదేశం
ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ (LPG) సరఫరాపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి వంట గ్యాస్ సరఫరా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సమావేశంలో పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఉన్నారు.
ఎల్పీజీ కొరత తలెత్తకుండా ఉండేందుకు గ్యాస్ ఉత్పత్తిని 10 శాతం పెంచాలని ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేయాలని ప్రధాని సూచించారు. అలాగే బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తూ అక్రమ దందాకు గ్యాస్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా, గ్యాస్ వినియోగాన్ని నియంత్రించేందుకు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఒక సిలిండర్ తీసుకున్న 25 రోజుల తర్వాత మాత్రమే రెండో సిలిండర్ బుకింగ్ చేసే అవకాశం కల్పించారు. అదే సమయంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను కొన్ని ఆయిల్ కంపెనీలు తాత్కాలికంగా నిలిపివేశాయి.
ఈ పరిణామాల ప్రభావం ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లపై పడుతోంది. ముఖ్యంగా ముంబై నగరంలో వాణిజ్య ఎల్పీజీ సరఫరా అంతరాయం ఏర్పడటంతో హోటల్ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. హోటల్–రెస్టారెంట్ సంఘం తెలిపిన వివరాల ప్రకారం నగర సుమారు 20 శాతం హోటళ్లు కార్యకలాపాలు నిలిపివేశాయి.
గ్యాస్ సరఫరా మెరుగుపడకపోతే ఇంకా రెండు రోజుల్లో పరిస్థితి త్వరగా 50 శాతం వరకు హోటళ్లు మూత ప్రమాదం ఉందని సంఘం హెచ్చరించింది. ప్రస్తుతం హోటళ్ల వద్ద ఉన్న గ్యాస్ నిల్వల ఆధారంగానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇక బెంగళూరులో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. వాణిజ్య ఎల్పీజీ సరఫరా నిలిచిపోవడంతో అనేక హోటళ్లు ఇప్పటికే ఇవాళ్టి నుంచి మూతపడ్డాయి. ఈ పరిస్థితి కొనసాగితే అనేక హోటల్ హోటళ్లు తాత్కాలికంగా మూతపడే ప్రమాదం ఉందని సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
