పంచాయతీ ఎన్నికల రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్షనా?
వేలాది మంది గ్రామీణ ప్రాంత అడ్వకేట్లు అయితే ఓటుకు లేదంటే ఏపీపీ రాత పరీక్షలకు దూరం కావాలా? ఈనెల 14వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అదే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్షలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తోంది. ఏపీపీ రాత పరీక్షలను జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ లో నిర్వహిస్తుండటంతో వేలాది మంది గ్రామీణ ప్రాంతాల న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే జోక్యం చేసుకొని ఈనెల 14న తలపెట్టిన ఏపీపీ రాత పరీక్షలను వాయిదా వేసేలా టీజీఎస్పీఆర్బీ కి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి.
