కల్వకుంట్ల కవిత అరెస్ట్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రైలురోకో చేపట్టారు. రైలు పట్టాలపై బైఠాయిస్తూ.. జాగృతి నాయకులు, కార్య కర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కామారెడ్డి పోలీసులు, ఆర్పీఎఫ్ రంగంలోకి దిగారు. కవితతో పాటు పలువురు జాగృతి నేతలను అరెస్టు చేశారు.
