మే నెలలో కవిత కొత్త పార్టీ: సిద్దిపేట నుంచే పోటీ!
TG: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. మే మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. పార్టీ పేరులో ‘తెలంగాణ’ అంతర్భాగంగా ఉంటుందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నుంచి బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. “రాష్ట్రంలో బీజేపీ ప్రభావితం ముగిసింది, మేమే ప్రధాన ప్రతిపక్షం” అని ధీమా వ్యక్తం చేసిన ఆమె, కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజిక తెలంగాణే లక్ష్యంగా తమ పార్టీలో యువతకు పెద్దపీట వేస్తూ ప్రజల పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.
