ఘనంగా ప్రారంభమైన జోనల్ లెవల్ హ్యాకథాన్ – ‘AI విద్యాసేతు 1.0’
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ఉప్పల్‌లో ‘కోడ్ ఫర్ న్యూ భారత్’ పోటీలు.. 5 ప్రాంతాల నుండి హాజరైన 366 మంది విద్యార్థులు.
హైదరాబాద్: సాంకేతికత మరియు ఆవిష్కరణలే లక్ష్యంగా పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నెం. 1, ఉప్పల్‌లో “జోనల్ లెవల్ హ్యాకథాన్ – AI విద్యాసేతు 1.0 (కోడ్ ఫర్ న్యూ భారత్)” అట్టహాసంగా ప్రారంభమైంది. ఐఐటీ ఢిల్లీకి చెందిన ఐ-హబ్ ఫౌండేషన్ ఫర్ కోబోటిక్స్ (IHFC) మరియు కేంద్రియ విద్యాలయ సంఘటన్ (KVS) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంఈ కార్యక్రమాన్ని కేంద్రియ విద్యాలయ సంఘటన్ (హైదరాబాద్ రీజియన్) ఉపాయుక్తులు డా. డి. మంజునాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా ‘వికసిత్ భారత్ 2047’ కలను సాకారం చేయడంలో ఇటువంటి హ్యాకథాన్‌లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ముఖ్య అతిథులు ఈ కార్యక్రమానికి శ్రీ ఏ. ఏ. ఇజ్రాయెల్ (అసిస్టెంట్ కమిషనర్), శ్రీమతి యాస్రా ఖాన్ (IHFC సీనియర్ ఎగ్జిక్యూటివ్), మరియు స్థానిక కేంద్రీయ విద్యాలయాల ప్రిన్సిపాళ్లు హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు. అనుభవాధారిత అభ్యాసానికి జాతీయ స్థాయి వేదిక కల్పించినందుకు వారు నిర్వాహకులను అభినందించారు.
పోటీల వివరాలు:ఈ హ్యాకథాన్‌లో ఎర్నాకులం, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మరియు భువనేశ్వర్ ప్రాంతాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు.
మొత్తం జట్లు: 64 విద్యార్థులు: 366 మంది మెంటర్లు: 65 మంది జూనియర్ మరియు సీనియర్ విభాగాల్లో విద్యార్థులు తమ AI ఆధారిత నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. ఈ రెండు రోజుల కార్యక్రమం 2025 డిసెంబర్ 09న ముగుస్తుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీ ఈ.వి. రమణ మాట్లాడుతూ, వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశమని తెలిపారు.
