Lionel Messi: హైదరాబాద్ చేరుకున్న లియోనెల్ మెస్సి
హైదరాబాద్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి (Lionel Messi) హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లారు. అక్కడ వందమందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు మెస్సీ బృందం ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటుంది. మెస్సి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోల్‌కతాలో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు బందోబస్తు పెంచారు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా మెస్సి భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
మెస్సి పర్యటన షెడ్యూల్ ఇదే..
- రాత్రి 7.50కి ఉప్పల్ స్టేడియంలో మెస్సి- గోట్ ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
- రాత్రి 8.06కి సీఎం రేవంత్‌రెడ్డి, మెస్సి మైదానంలోకి దిగనున్నారు
- రాత్రి 8.08కి రోడ్రిగో, లూయిస్ సువారెజ్ మైదానంలోకి వస్తారు
- రాత్రి 8.13కి పెనాల్టీ షూటౌట్
- రాత్రి 8.18కి మైదానంలోకి దిగనున్న రాహుల్ గాంధీ
