శబరిమలలో మకరజ్యోతి దర్శనం
శబరిమల: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనమిచ్చింది. ఈ పవిత్ర ఘట్టాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప భక్తులు జ్యోతిని దర్శించుకుని పరవశించారు.
పొన్నాంబలమేడు పర్వత శిఖరం పై నుంచి మూడు సార్లు మకరజ్యోతి దర్శనమివ్వడంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మార్మోగాయి. మకర సంక్రాంతి పర్వదినాన జరిగిన ఈ మహాదృశ్యం భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది.
