మల్లాపూర్: ట్రాక్టర్ బోల్తా.. నలుగురు కూలీలు మృతి
మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముగిలిపేట వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు. పసుపు పంట కోతకు వెళ్లి తిరిగివస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో పలువురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
