మెస్సికి మమతా బెనర్జీ క్షమాపణలు
కోల్‌కతా: ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సి పర్యటన సందర్భంగా కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో గందరగోళం చోటుచేసుకోవడంపై సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మెస్సికి, క్రీడాభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. స్టేడియం నుంచి మెస్సి త్వరగా వెళ్లిపోయాడంటూ అంతకుముందు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మైదానంలోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు.
