రాష్ట్ర ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్: రంగుల హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి వివేక్ వెంకటస్వామి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. స్నేహం, ఐకమత్యం, ఆనందానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ ప్రతి కుటుంబంలో సంతోషం, ఆరోగ్యం, అభివృద్ధి వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.
హోలీ పండుగ మనుషుల మధ్య ఉన్న విభేదాలను దూరం చేసి, పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించే వేడుక అని మంత్రి పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సౌహార్దత మరింత బలపడాలని, అందరూ ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ హోలీ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆరంభాలకు నాంది పలికి, ఆశలు మరియు విజయాలతో నిండిన రోజులను తీసుకురావాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
