టోలిచౌకి ఘటనపై వెంటనే స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్: టోలిచౌకి ప్రాంతంలో జరిగిన ఘటనపై రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి వెంటనే స్పందించారు. ఘటన విషయం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, రక్షణ చర్యలు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
అలాగే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, గాయపడిన కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
