దివంగత నేత పీ. జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఘనంగా నివాళులర్పించారు.
హైదరాబాద్, డిసెంబర్ 28:
దివంగత నేత పీ. జనార్దన్ రెడ్డి (పీ జే ఆర్) గారి వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్‌లోని పీ జే ఆర్ విగ్రహం వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, పీ జే ఆర్ కూతురు విజయ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, పీ జే ఆర్ ఒక నిజమైన ప్రజా నాయకుడని, పేదల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన గొప్ప నాయకుడిగా ఆయనను స్మరించుకున్నారు. ఆయన సేవలు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొన్నారు.
