వాట్సాప్‌లో కొత్త మోసం… ‘ఘోస్ట్ పేయిరింగ్’తో జాగ్రత్త
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రూట్ వెతుక్కుంటూ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్రమత్తంగా ఉంటే తప్ప సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోని పరిస్తితి ఏర్పడింది. నేరగాళ్లు అనుసరిస్తున్న విధానాలు నమ్మలేని విధంగా గ్రూపుల్లో ప్రత్యక్షం అవుతున్నాయి. తాజాగా వాట్స్ అప్ ను కూడా సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్నారు.
ఘోస్ట్ పేరింగ్ పేరుతో లింక్ పంపి ఆకర్షిస్తున్నారు. ఇందుకోసం ఫోటో చూశారా…మీఫోటోనే టార్గెట్ చేసుకుని మిమిల్ని చీటింగ్ చేసే విధంగా పావులు కదుపుతున్నారు. తాజాగా పోలీసుల దృష్టికి వచ్చిన ఈ ఘటన ఆధారంగా పోలీసులు సైబర్ చీటర్స్ నుంచి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పలు సూచనలు చేస్తున్నారు..
