అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు శోభ చేకూర్చిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ సోమవారం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు (International Kite Festival). జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ.. అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీతీరంలో జరుగుతోన్న ఈ ఫెస్టివల్‌లో ఛాన్స్‌లర్‌తో కలిసి కైట్ ఎగురవేశారు.
