హయత్‌నగర్‌లో ఆందోళన.. ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి ఆదేశం
హైదరాబాద్: నగరంలోని హయత్‌నగర్‌లో విజయవాడ హైవేపై ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని స్థానికులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ‘ఈటీవీ-ఈనాడు’ కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. లెక్చరర్స్ కాలనీ వద్ద ఫుట్‌ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామన్నారు. మూడు నెలల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కొన్ని అభ్యంతరాల వల్ల పనులు ఆలస్యమయ్యాయని చెప్పారు.
