పుకార్లతో పెట్రోల్ బంకుల వద్ద క్యూలు – కోరుట్ల, మెట్‌పల్లిలో కొరత.. భయంతో నిల్వలు పెంచుతున్న వాహనదారులు
జగిత్యాల:
ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న పుకార్ల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు భారీగా బంకలకు చేరుతున్నారు. కోరాట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో ఇంధన సరఫరా అంతరాయం ఏర్పడటంతో కొన్ని పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం ప్రభావం గల్ఫ్ దేశాలపై పడుతుండటంతో పెట్రోల్, డీజిల్ సరఫరాలో సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. కొన్ని బంకులు మూతపడటంతో మిగిలిన బంకుల వద్ద పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు.
బంకులు పూర్తిగా మూతపడతాయనే భయంతో వాహనదారులు పెద్ద మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. వాహనాల ట్యాంకులను పూర్తిగా నింపుకోవడంతో పాటు ప్లాస్టిక్ బాటిళ్లు, క్యాన్లలో కూడా ఇంధనం తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.
పెట్రోల్ బంకు యజమానుల ప్రకారం, మార్చి 11 వరకు పెట్రోల్, డీజిల్ సరఫరా ఉంటుందని తెలిపారు. అయితే ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో కూడా ఇదే పరిస్థితి. ప్రధాన పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద సంఖ్యలో చేరి ఫుల్ ట్యాంకులు నింపుతున్నారు.
అయితే ఈ పరిస్థితిపై స్పందించిన పెట్రోల్ డీలర్ల అసోసియేషన్, క్రూడ్ ఆయిల్ కొరతపై వస్తున్న వార్తలు తప్పుడు ప్రచారాలేనని స్పష్టం చేసింది. దేశానికి సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ ప్రస్తుతం రిటైల్ ధరలు పెరగబోవని, పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేవు చేసిన.
